తమిళనాడు కడలూరు జిల్లాలోని నైవేలీ లిగ్నైట్ పవర్ స్టేషన్లో భారీ ప్రమాదం జరిగింది. ఎన్ఎల్సీ యూనిట్-2లోని 5వ బాయిలర్ సాంకేతిక లోపంతో అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
గత మే నెలలోనూ టన్నెల్‌లోని 6వ యూనిట్లో బాయిలర్ పేలింది. నాటి ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.