తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాతో కువైట్​లో మృతి- భారత్​లో బొమ్మకు అంత్యక్రియలు

దేశం కాని దేశంలో కరోనాతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దేశాల మధ్య విమాన ప్రయాణాలు లేకపోవడం వల్ల కడసారి చూపునకు కూడా నోచుకోక తల్లడిల్లింది ఆ కుటుంబం. ఎలాగైనా తమ కుటుంబ పెద్దకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించాలని సంకల్పించింది. బొమ్మను తయారుచేసి దహన సంస్కారాలు నిర్వహించింది.

family
విదేశాల్లో కుమారుడి మృతి.. బొమ్మకు అంత్యక్రియలు

By

Published : May 1, 2020, 3:15 PM IST

కుటుంబ పెద్దను కోల్పోయామన్న దిగులు ఓవైపు. లాక్​డౌన్ వేళ కువైట్​ నుంచి మృతదేహాన్ని తీసుకురాలేని నిస్సహాయత మరోవైపు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొంది రాజస్థాన్​కు చెందిన ఓ కుటుంబం. చివరకు బొమ్మకు అంత్యక్రియలు నిర్వహించి... పెద్దాయన ఆత్మశాంతి కోసం ప్రార్థించింది.

కువైట్​లో ఖననం... ఇక్కడ దహనం...

రాజస్థాన్​ డుంగర్​పుర్​ సీమల్​వారాకు చెందిన 56 ఏళ్ల దిలీప్​ కలాల్​ 15 ఏళ్లుగా కువైట్​లో హోటల్​ నడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. దాదాపు 20 రోజులు చికిత్స అందించినా వైద్యులు దిలీప్ ప్రాణాలు కాపాడలేకపోయారు.

కరోనా సంక్షోభంతో దేశాల మధ్య రాకపోకలు లేవు. ఈ పరిస్థితుల్లో దిలీప్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చే వీలు లేదు. చేసేది లేక కువైట్​లోని హోటల్​ సిబ్బందే ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతదేహాన్ని ఖననం చేసి, ఆ దృశ్యాల్ని కుటుంబ సభ్యులకు పంపారు.

దిలీప్ మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు... కనీసం ఆయనకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలైనా నిర్వహించాలని అనుకున్నారు. దిలీప్ పాత దుస్తులు, ఫొటోతో ఓ బొమ్మను తయారు చేశారు. మృతుడి కుమారుడు సహా మరో 10 మంది కలిసి ఊరేగింపుగా బొమ్మను తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. అస్థికలు సేకరించి... ఆత్మశాంతి కోసం ఇతర పూజా కార్యక్రమాలు జరిపించారు.

కరోనాతో కువైట్​లో మృతి- భారత్​లో బొమ్మకు అంత్యక్రియలు

ఇదీ చూడండి:దేశంలోని రెడ్‌, ఆరెంజ్​, గ్రీన్​ జోన్ల జాబితా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details