నవంబరు 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. కానీ కొన్ని ఎంపిక చేసిన రూట్లలో విమాన సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కార్గో సేవలకూ అంతరాయం ఉండదని పేర్కొంది.
'అప్పటివరకు అంతర్జాతీయ విమాన సేవలు రద్దు' - నవంబరు 30 వరకు విమాన సేవలు రద్దు
కరోనా వ్యాప్తి దృష్ట్యా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నవంబరు 30 వరకు నిషేధం కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సేవలను నిలిపివేసింది డీజీసీఏ.
కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సేవలను డీజీసీఏ నిలిపివేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'వందే భారత్ మిషన్'లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన దేశాలకు జులై నుంచి ప్రత్యేక విమాన సేవలు ప్రారంభమయ్యాయి. భారత్ ఎయిర్ బబుల్ కార్యక్రమంలో భాగంగా 18 దేశాలతో విమాన ప్రయాణ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం ద్వారా భారత్కు, ఆయా దేశాలకు మధ్య విమాన సేవలు ఉంటాయి. అమెరికా , యూకే , యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ తదితర దేశాలు ఇందులో ఉన్నాయి.