పక్షం రోజుల్లో ఇద్దరు దిల్లీ మాజీ మహిళా ముఖ్యమంత్రులు కన్నుమూశారు. జులై 20వ తేదీన గుండెపోటుతో షీలాదీక్షిత్ తుదిశ్వాస విడువగా.. సరిగ్గా పక్షం రోజులకు మరో మహిళా నేత సుష్మాస్వరాజ్ అదే తరహాలో కన్నుమూశారు. షీలా దీక్షిత్ దిల్లీ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఆమె కంటే ముందు ఆ పదవిని అధిష్ఠించిన సుష్మా స్వరాజ్ జాతీయ నాయకురాలిగా తనదైన ముద్ర వేశారు.
15 రోజుల్లో ఇద్దరు మాజీ సీఎంలు కన్నుమూత - మాజీ మంత్రులు
దేశ రాజధాని దిల్లీకి ముఖ్యమంత్రిగా సేవలందించిన ఇద్దరు మహిళా నాయకులు పక్షం రోజుల్లోనే కన్నుమూయటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జులై 20న గుండెపోటుతో షీలాదీక్షిత్ తుదిశ్వాస విడిచారు. సరిగ్గా పదిహేను రోజుల్లోనే సుష్మాస్వరాజ్ అదే తరహాలో హఠాన్మరణం చెందారు.
దిల్లీ అయిదో ముఖ్యమంత్రిగా సుష్మాస్వరాజ్ పనిచేయగా.. ఆరో ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ సేవలందించారు. షీలాదీక్షిత్ కంటే సుష్మా 14 ఏళ్లు చిన్న. 1998లో దిల్లీ ఎన్నికలకు 40 రోజుల ముందు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆమె అకస్మాత్తుగా పెరిగిన ఉల్లిగడ్డల ధర కారణంగా ఓటమి చవిచూశారు. వాటి ధరలను తగ్గించడానికి చౌకధరల దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినా ఫలితం లేకపోయింది. కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు పలికిన ధరలు ఆమె ప్రభుత్వాన్ని పతనం చేశాయి.
ఇదీ చూడండి: ట్విట్టర్ ద్వారా ప్రజల కష్టాలు తీర్చిన 'సూపర్ మామ్'