తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైట్లీ అంత్యక్రియల్లో మంత్రి ఫోన్ దొంగతనం

అరుణ్​జైట్లీ అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. అగ్రనేతలు సహా అనేక మంది జైట్లీకి తుది వీడ్కోలు పలకడానికి తరలివెళ్లారు. ఈ సందర్భంలో కేంద్ర సహాయ మంత్రి, భాజపా ఎంపీ బాబుల్​ సుప్రియో సహా 11 మంది ఫోన్ల దొంగతనం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి.. చరవాణిలను ట్రేస్​ చేస్తున్నారు.

జైట్లీ అంత్యక్రియల్లో మంత్రి ఫోన్ దొంగతనం

By

Published : Aug 27, 2019, 2:03 PM IST

Updated : Sep 28, 2019, 11:18 AM IST

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ అంత్యక్రియల వేళ.. అసలే విషాదం. అందులోనే మరో దారుణం చోటుచేసుకుంది. నేతలు, అభిమానులు శోక సంద్రంలో ఉన్న సమయంలో... దొంగలు ఏకంగా 11 మంది ఫోన్లను దొంగలించారు. చరవాణిలు కోల్పోయిన వారిలో భాజపా ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బాబుల్​ సుప్రియో, పతాంజలి ప్రతినిధి ఎస్​కే తిజరవాల ఉన్నారు.

కొద్ది కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో సతమతమవుతున్న జైట్లీ... శనివారం తుది శ్వాస విడిచారు. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అంత్యక్రియలు దిల్లీలోని నిగంబోధ్​ ఘాట్​లో ఆదివారం జరిగాయి. జైట్లీ అంతిమ సంస్కరణలో పాల్గొనడానికి కేంద్ర మంత్రులు సహా అనేక మంది ప్రజలు నిగంబోధ్​ ఘాటకు తరలివెళ్లారు. ఈ సమయంలోనే దొంగలు తమ చేతులకు పని చెప్పారు.

అంత్యక్రియలను కూడా వదలకుండా నేరాలకు పాల్పడటం ఎంతో బాధాకరమని పతాంజలి ప్రతినిధి తిజరవాల ట్వీట్​ చేశారు.

తిజరవాల ట్వీట్​

'జైట్లీకి తుది వీడ్కోలు పలుకుతున్న సమయంలో నా ఫోన్​ కూడా నాకు వీడ్కోలు పలికింది. శ్మశానవాటికనూ వదలకుండా దొంగతనాలకు పాల్పడటం ఎంతో బాధాకరం.'
--- తిజరవాల, పతంజలి ప్రతినిధి.

ఈ ఘటనకు సంబంధించి 5 ఫిర్యాదులు అందినట్టు దిల్లీ పోలీసులు తెలిపారు. చరవాణిలను ట్రేస్​ చేస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి:- జైట్లీ కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ పరామర్శ

Last Updated : Sep 28, 2019, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details