తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: రాజీనామాలపై నేడు సుప్రీం విచారణ

ఎన్నో మలుపులు తిరిగిన కర్ణాటక రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. రెబల్​ ఎమ్మెల్యేల రాజీనామా ఆమోద వ్యాజ్యాలపై నేడు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. ఒకవేళ వీరి రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్​కు ఆదేశాలిస్తే.. కుమారస్వామి సర్కారు గద్దె దిగక తప్పదని అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉండనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కర్ణాటకీయం: రాజీనామా వ్యాజ్యాలపై నేడు సుప్రీం విచారణ

By

Published : Jul 16, 2019, 5:20 AM IST

Updated : Jul 16, 2019, 8:35 AM IST

కర్ణాటకీయం: రాజీనామాలపై నేడు సుప్రీం విచారణ

అధికార, ప్రతిపక్షాల ఎత్తులు, పైఎత్తులను దాటుకుని సుప్రీం కోర్టును చేరింది కన్నడ రాజకీయ నాటకం. రెబల్​ ఎమ్మెల్యేల రాజీనామాపై నేడు విచారణ చేయనుంది అత్యున్నత న్యాయస్థానం. కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వంలో మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరిలో 10 మంది శాసనసభ్యులు తమ రాజీనామాల్ని ఆమోదించేలా స్పీకర్​కు ఆదేశాలివ్వాలని సుప్రీంను ఆశ్రయించారు. అనంతరం.. మరో ఐదుగురు అదే బాట పట్టారు. వీరి వ్యాజ్యాలపై నేడు వాదనలు విననుంది అత్యున్నత న్యాయస్థానం.

16 మందిలో కాంగ్రెస్​ నుంచి 13, జేడీఎస్​ నుంచి ముగ్గురు శాసనసభ్యులున్నారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు శంకర్​, నగేశ్​ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.

గురువారమే విశ్వాస పరీక్ష

సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినందుకు కుమారస్వామి బల నిరూపణ చేసుకోవాలని ప్రతిపక్ష భాజపా పట్టుబట్టింది. సోమవారం కర్ణాటక విధాన సభలో సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. గురువారం ఉదయం పదకొండు గంటలకు తీర్మానంపై చర్చ జరగనుంది. వెను వెంటనే బల పరీక్ష జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫలితంగా కాంగ్రెస్ - జేడిఎస్ సంకీర్ణ సర్కారు భవితవ్యం తేలిపోనుంది

నాలుగు రోజుల్లో భాజపా ప్రభుత్వం..

కాంగ్రెస్​-జేడీఎస్​ ప్రభుత్వానికి శాసససభలో మెజారిటీ తగ్గనుందని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప ప్రకటించారు. ఫలితంగా రానున్న మూడు-నాలుగు రోజుల్లో కుమారస్వామి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ తర్వాత భాజపాదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ కావాలనుకునే పాలన అందిస్తామన్నారు యడ్యూరప్ప.

Last Updated : Jul 16, 2019, 8:35 AM IST

ABOUT THE AUTHOR

...view details