తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌‌ లక్ష్మణన్‌ కన్నుమూత - సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

సతీమణి మరణంతో మానసిక కుంగుబాటుకు గురై.. రెండు రోజు క్రితం తమిళనాడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ ఏఆర్​ లక్షణన్​ కన్నుమూశారు. జస్టిస్‌ ఏఆర్‌ లక్ష్మణన్‌ 2000లో రాజస్థాన్‌, 2001లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2007లో పదవీ విరమణ చేశారు.

Supreme court former judge jutice AR Laxmanan passed way
సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌‌ లక్ష్మణన్‌ కన్నుమూత

By

Published : Aug 28, 2020, 7:08 AM IST

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏఆర్‌ లక్ష్మణన్‌ (78) కన్నుమూశారు. సతీమణి మరణంతో మానసిక కుంగుబాటుకు గురై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రెండు రోజులపాటు చికిత్స పొందిన ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

జస్టిస్‌ ఏఆర్‌ లక్ష్మణన్‌ 1942 మార్చి 22న తమిళనాడులోని శివగంగై జిల్లా దేవకోట్టైలో జన్మించారు. మద్రాసు హైకోర్టు, కేరళ హైకోర్టులలో న్యాయమూర్తిగా సేవలందించారు. 2000లో రాజస్థాన్‌, 2001లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2002లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007లో పదవీ విరమణ చేశారు. తర్వాత రెండేళ్లపాటు లా కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. పలు కేసుల్లో సంచలన తీర్పులు వెల్లడించిన ఘనత ఆయనకు ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించడం అందులో ఒకటి.

ప్రస్తుతం కారైకుడిలో నివసిస్తుండగా ఆయన భార్య మీనాక్షి ఆచ్చి అనారోగ్యంతో మంగళవారం మరణించారు. దీంతో మానసిక కుంగుబాటుకు గురై అస్వస్థతకు లోనయ్యారు. తిరుచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు.

ఇదీ చూడండి:-ఆ ప్రకటనలు పచ్చి అబద్ధాలు- పాక్​పై భారత్​ ఫైర్​

ABOUT THE AUTHOR

...view details