విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణను జులై 16కు వాయిదా వేసింది.
పేదల కోటా వ్యతిరేక వ్యాజ్యాలపై విచారణ వాయిదా
అగ్రవర్ణాల పేదలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 10 శాతం కోట అమలును సవాలు చేస్తూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వ్యాజ్యాలన్నింటిని కలిపి జులై 16న విచారిస్తామని పేర్కొంది.
పేదల కోటా వ్యతిరేక వ్యాజ్యాలపై విచారణ వాయిదా
దేశంలో రిజర్వేషన్లు 49 శాతం దాటొద్దన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేవలం ఆర్థిక స్థితిని ఆధారంగా చేసుకొని రిజర్వేషన్లు ఇవ్వరాదని... అది రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘించినట్లేనని వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.
- ఇదీ చూడండి: పీఓకే, గిల్గిత్పై వ్యాజ్యం- పిటిషనర్‌కు జరిమానా