తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం - పాకిస్థాన్

భారత రక్షణ శాఖ, డీఆర్​డీఓ కలసి అత్యధిక వేగంతో ప్రయాణించే సముద్రతల క్షిపణి 'బ్రహ్మోస్'​ను విజయవంతంగా పరీక్షించాయి. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే ఈ క్షిపణిని సముద్రతలం సహా భూ, గగనతలాల నుంచీ ప్రయోగించవచ్చని అధికారులు తెలిపారు.

బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

By

Published : Jun 5, 2019, 5:52 AM IST

Updated : Jun 5, 2019, 8:53 AM IST

బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

అత్యధిక వేగంతో ప్రయాణించే సూపర్‌సోనిక్ సముద్రతల క్షిపణి బ్రహ్మోస్​ను రక్షణశాఖ, డీఆర్​డీఓ (భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) విజయవంతంగా పరీక్షించాయి. ఒడిశా చంఢీపుర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)​ లోని మూడో కాంప్లెక్స్ నుంచి ఈ క్షిపణిని పరీక్షించినట్లు డీఆర్​డీఓ అధికారులు తెలిపారు.

ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్​ను సముద్రతలం సహా భూ, గగనతలాల నుంచీ ప్రయోగించవచ్చని అధికారులు వివరించారు. 290 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్‌తో అత్యంత కచ్చితత్వంతో బ్రహ్మోస్ పనిచేస్తుంది.

ఈ క్షిపణి చైనా, పాకిస్థాన్‌ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడంలో సహాయపడుతుందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. డీఆర్​డీఓ , రష్యాకు చెందిన ఎన్​పీఓఎం​తో కలిసి బ్రహ్మోస్​ను రూపొందించింది.

Last Updated : Jun 5, 2019, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details