పంజాబ్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై హోంమంత్రిగా కూడా ఉన్న తనను నివేదిక కోరకుండా గవర్నర్ ఉన్నతాధికారులను పిలవడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. భాజపా చిల్ల చేష్టలకు గవర్నర్ తలవంచడం దురదృష్టకరమని విమర్శించారు.
'శాంతిభద్రతలపై స్పష్టత కావాలంటే నన్ను పిలవండి' - Punjab law and order news
పంజాబ్‌లో శాంతిభద్రతల విషయంపై ప్రశ్నించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆ రాష్ట్ర గవర్నర్ పిలిచారు. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ మండిపడ్డారు. హోంమంత్రిగా ఉన్న తనను నివేదిక కోరకుండా తన అధికారులను పిలవడమేంటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మొబైల్ టవర్ల విధ్వంసం వంటి చెదురుమదురు ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యపై ప్రశ్నించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను గవర్నర్ వీపీ సింగ్ బద్నౌర్ పిలవడంతో ముఖ్యమంత్రి స్పందించారు. వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన పరిణామాల నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పంజాబ్ శాంతిభద్రతల పరిస్థితులు దిగజారాయని దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఒకవేళ శాంతిభద్రతల పరిస్థితిపై గవర్నర్ నిజంగ ఆందోళన ఉంటే హోం మంత్రిత్వశాఖను కూడా చూస్తున్న తనతో చర్చించాలని అమరీందర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:-అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 'పోల్ ప్యానెళ్లు'