మామిడి పళ్లు అనగానే గుర్తొచ్చేది.. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేసర్. అయితే ఇందులోని అధిక చక్కెర స్థాయిల కారణంగా.. డయాబెటిక్ రోగులు ఈ పళ్లకు దూరంగా ఉండక తప్పదు. ఇలాంటి వారికి తీపికబురునందిస్తూ గుజరాత్‌లోని గిర్‌లో ఓ రైతు.. కొత్త రకం మామిడిని పండిస్తున్నాడు. ఫ్లోరిడాలో 'షుగర్ ఫ్రీ మ్యాంగో'గా పేరుగాంచిన 'టామ్ ఆట్కిన్స్' మామిడి రకాన్ని పండించి విజయవంతమయ్యాడు దినేశ్ గాదయ్య. డయాబెటిక్ వ్యాధిగ్రస్థుల కోసం త్వరలోనే ఈ మామిడి మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.
చక్కెర తక్కువ, క్యాలరీలెక్కువ..
ఇతర మామిడి రకాలతో పోలిస్తే 'టామ్ ఆట్కిన్స్'లో చక్కెర స్థాయిలు సుమారు 75 శాతం వరకు తక్కువగా ఉంటాయి. క్యాలరీలు ఎక్కువే. ఫలితంగా మిగతా రకం మామిడితో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు ఏ చింతలేకుండా దీనిని ఆస్వాదించవచ్చు. ఫ్లోరిడాలో అభివృద్ధి చెందిన ఈ మామిడి రకం తొలుత ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు.. అక్కడి నుంచి గిర్కు వచ్చింది.