విజయాన్ని సాధించే క్రమంలో విద్యార్థులు సాధారణంగా ఒత్తిడికి గురవుతుంటారు. అయితే విద్యార్థులెవరూ మానసిక ఒత్తిడికి గురి కావొద్దన్నారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. రాజస్థాన్‌లోని కోటా నగరంలో నిర్వహించిన కోటా కార్నివాల్(కోకా) యూత్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా హాజరైన బిర్లా.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
'విజయాన్ని సాధించే క్రమంలో మానసిక ఒత్తిడికి గురికావొద్దు '
విద్యార్థులు విజయం సాధించే క్రమంలో ఒత్తిడికి గురికావొద్దన్నారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. రాజస్థాన్‌లోని కోటా నగరంలో నిర్వహించిన యూత్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ మేరకు విద్యార్థులకు సూచించారు.
'విజయాన్ని సాధించే క్రమంలో మానసిక ఒత్తిడికి గురికావొద్దు '
రెండు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని నగరంలోని కామర్స్ కళాశాల మైదానంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓం కసేరా, పోలీసు సూపరింటెండెంట్ దీపక్ భార్గవ్‌తో సహా ప్రముఖులు హాజరయ్యారు. సుమారు 1.75 లక్షలమంది విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Last Updated : Feb 29, 2020, 1:18 AM IST