తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యావ్యవస్థను క్రమబద్ధీకరించండి: సుప్రీం - విద్యార్థులు

దేశంలో గాడితప్పిన విద్యావ్యవస్థ కారణంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనై, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అందువల్ల మొత్తం విద్యావ్యవస్థను ప్రక్షాళించి క్రమబద్ధీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

విద్యావ్యవస్థను క్రమబద్ధీకరించండి: సుప్రీం

By

Published : Jun 4, 2019, 10:42 PM IST

Updated : Jun 5, 2019, 12:23 AM IST

దేశంలోని మొత్తం విద్యావ్యవస్థను క్రమబద్ధీకరించాలని, అందువల్ల వివిధ కోర్సులకు జరిగే అడ్మిషన్ల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉంటారని సుప్రీంకోర్టు సూచించింది. మహారాష్ట్ర మెడికల్​ అడ్మిషన్లకు సంబంధించిన అంశంపై విచారణ సందర్భంలో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.

దేశంలో గాడితప్పిన విద్యావ్యవస్థ కారణంగా విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని సుప్రీంకోర్టు మండిపడింది. వెంటనే విద్యావ్యవస్థను ప్రక్షాళించి, గాడిలో పెట్టాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది.

అడ్మిషన్లు చేపట్టండి

మహారాష్ట్రలో 2019-20 సంవత్సరానికిగాను చేపట్టిన పోస్ట్​ గ్రాడ్యుయేషన్ మెడికల్, డెంటల్​ అడ్మిషన్ల అంశంపై జస్టిస్​ ఇందు మల్హోత్రా, జస్టిస్​ ఎమ్​ఆర్​షా ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్మిషన్ల వివాదానికి పూర్తి బాధ్యత మహారాష్ట్ర ప్రభుత్వానిదే అని మొట్టికాయలు వేసింది.

సుప్రీం ఆదేశాలను ప్రస్తావిస్తూ, ఇప్పటికే చాలా కాలం గడిచినందున... కొత్త ఆదేశాలు జారీ చేసి, మరో కొత్త సమస్య సృష్టించబోమని ధర్మాసనం పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్​ప్రవేశాల కోసం చివరి రౌండ్​ అడ్మిషన్లను జూన్​ 14 లోపు నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. ఇప్పటికే అగ్రవర్ణ పేదలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లపై సుప్రీం స్టే విధించింది.

ప్రక్షాళించండి

ఏటా అడ్మిషన్ల సమయంలో ఇలాంటి వివాదాల కారణంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సుప్రీం అభిప్రాయపడింది. ఏ కాలేజిలో, ఏ కోర్సులో అడ్మిషన్​ దొరుకుతుందో తెలియక, విద్యార్థుల కెరీర్​ కూడా నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.

విద్యార్థులను ఈ దురవస్థ నుంచి తప్పించాలని, అందుకు విద్యావ్యవస్థను క్రమబద్ధీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. విద్యార్థుల భవిష్యత్ గురించే తమ ఆందోళనని వెల్లడించింది.

ఇదీ చూడండి: మహిళలే టార్గెట్.. హత్య, ఆపై అత్యాచారం

Last Updated : Jun 5, 2019, 12:23 AM IST

ABOUT THE AUTHOR

...view details