తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాహుల్‌ను అడ్డుకుంటే కాంగ్రెస్‌ నాశనమే'

కాంగ్రెస్​ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​. పార్టీ పగ్గాలు చేపట్టనివ్వకుండా రాహుల్​ను​ అడ్డుకుంటే కాంగ్రెస్​ నాశనమైపోతుందన్నారు. పార్టీ సీనియర్​ నాయకులు సోనియా గాంధీకి లేఖ రాయడాన్ని రౌత్​ తప్పుబట్టారు​.

Stopping Rahul from leading party will destroy Congress
'రాహుల్‌ను అడ్డుకుంటే కాంగ్రెస్‌ నాశనమే'

By

Published : Aug 30, 2020, 6:47 PM IST

Updated : Aug 30, 2020, 7:08 PM IST

కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టనివ్వకుండా రాహుల్‌ను అడ్డుకోవడమంటే ఆ పార్టీని చేజేతులా నాశనం చేయడమేనని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి 23 మంది సీనియర్లు లేఖ రాసిన నేపథ్యంలో ఆయన పార్టీ అధికారిక పత్రిక 'సామ్నా'లోని తన కాలమ్‌లో ఈమేరకు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ఓ వర్గం రాహుల్‌ నాయకత్వాన్ని అడ్డుకుంటోందని పేర్కొన్నారు సంజయ్. పార్టీ నడిపేందుకు పూర్తి స్థాయి, క్రియాశీల నాయకుడు కావాలంటూ సీనియర్లు లేఖ రాయడాన్ని రౌత్‌ తప్పుబట్టారు. ఈ నాయకులను క్రియాశీలంగా ఉండొద్దని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. క్రియాశీలం పేరుతో రాహుల్‌ను అడ్డుకోవడమంటే పార్టీని నాశనం చేయడమేనని, వినాశనాన్ని కొనితెచ్చుకోవడమేనని రౌత్‌ పేర్కొన్నారు.

అతిపెద్ద రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌!

గాంధీయేతరులు కాంగ్రెస్‌ అధ్యక్షుడు అవ్వాలన్న ఉపాయం బాగుందని, అయితే ఈ లేఖ రాసిన 23 మందిలో ఎవరికీ అలాంటి సామర్థ్యం లేదని రౌత్‌ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రకాల మాస్కులు తొడుక్కుని కాంగ్రెస్‌ పార్టీ దేశమంతా విస్తరించి ఉందని రౌత్‌ అన్నారు. కాంగ్రెస్‌ నుంచి వీడి ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న నేతలనుద్దేశించి ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఆ మాస్కులన్నీ తొలగిపోతే అతిపెద్ద రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌ అవతరలించగలదని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్‌ అనేది ఓ ముసలవ్వ లాంటిదని, అది ఎప్పటికీ మరణించదంటూ వీఎన్‌ గాడ్గిల్‌ చేసిన వ్యాఖ్యలను తన కాలమ్‌లో ప్రస్తావించారు సంజయ్ రౌత్. అయితే, ఆ ముసలావిడ పక్కన ఉండాలా లేదా అన్నది రాహుల్‌ నిర్ణయించుకోవాలని అన్నారు.

ఇదీ చూడండి:బొమ్మలపై కాదు.. పరీక్షలపై చర్చించండి: రాహుల్​

Last Updated : Aug 30, 2020, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details