ఉత్తరాఖండ్ చంపావత్‌లో రాళ్లు విసిరే ఉత్సవంలో 120 మంది భక్తులు గాయపడ్డారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని.. బరాహి అమ్మవారి ఆలయం వద్ద ఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సంప్రదాయం ప్రకారం బగ్వాల్ ఉత్సవంగా పిలుచుకునే ఈ వేడుకల్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటారు. వాటి నుంచి తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తారు. వారికి గాయాలపాలైనా పెద్దగా పట్టించుకోరు.
రాళ్ల ఉత్సవంలో... దెబ్బలు తగిలినా హాయే! - రాఖీ పండుగ
ఉత్తరాఖండ్ చంపావత్‌లో సంప్రదాయ బగ్వాల్ ఉత్సవం ఘనంగా జరిగింది. వేడుకల్లో భాగంగా భక్తులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఫలితంగా 120 మంది గాయపడ్డారు.
రాళ్ల ఉత్సవంలో... దెబ్బలు తగిలినా హాయే!