రాష్ట్రాలకు డిగ్రీ పరీక్షలు రద్దు చేసే హక్కు లేదని.. ఒకవేళ అలా చేస్తే డిగ్రీ చెల్లదని తెగేసి చెప్పింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ). దిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు డిగ్రీ పరీక్షలు రద్దు చేయడంపై తీవ్రంగా స్పందించింది.
డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలంటూ సెప్టెంబర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పరిశీలిస్తున్న వేళ.. రాష్ట్రాలు యూజీసీ నియమాలను మార్చకూడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు కోరుకోవట్లేదన్నారు. పరీక్షల నియమ, నిబంధనలు మార్చే హక్కు యూజీసీకి మాత్రమే ఉందని, రాష్ట్రాలు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం... విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.