నాలుగు నెలల అనంతరం శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారి తెరుచుకుంది. భారీ మంచు కురవడం కారణంగా గతేడాది డిసెంబర్లో మూతపడ్డ రహదారిని భారత ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ ప్రారంభించారు. 434 కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారి కశ్మీర్ లోయ, లద్ధాఖ్ ప్రాంతాలను కలుపుతోంది.
మంచును తొలగించేందుకు తీవ్ర కృషి
ఈ రహదారిలో మంచును తొలగించడానికి ప్రాజెక్ట్ బీకన్, ప్రాజెక్ట్ విజయక్ను నిర్వహించారు. మార్చి 5న ఈ ప్రాజెక్ట్లు మొదలైన ప్రాజెక్టులు... ఈ నెల 14,15న ముగిశాయి.