తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జన్మాష్టమి నాడు వాడవాడలా చిన్ని కృష్ణుల సందడి - అష్టమి

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. మహిళలు దాండియా ఆటలతో రాధాకృష్ణుల ఆరాధన చేస్తున్నారు.

srikrishna Janmashtami being celebrated allover India

By

Published : Aug 23, 2019, 11:36 AM IST

Updated : Sep 27, 2019, 11:32 PM IST

దేశవ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పరంధాముని దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

చిన్నారులు కృష్ణుని వేషం ధరించి... చిన్ని కృష్ణయ్యను తలపిస్తున్నారు. మహిళలు దాండియా ఆడుతూ సందడి చేస్తున్నారు. యువకులు ఉట్ల పండుగకు సన్నద్ధమవుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఆ నవనీత చోరుని ఆరాధనలో తరిస్తున్నారు.

తమిళనాడు మధురైలో కృష్ణయ్య ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి. భక్తులు దేవదేవుణ్ని ధూపదీప నైవేద్యాలతో ఆరాధిస్తున్నారు. కర్ణాటక బెంగళూరులోని ఇస్కాన్​ ఆలయం​లో వైభవోపేతంగా కృష్ణారాధన జరుగుతోంది.

నేపాల్​లోనూ కృష్ణలీలలు

నేపాల్​ లలిత్​పురలోని కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి.

కృష్ణ జయంతి

విష్ణుమూర్తి దశావతారాల్లో ఎనిమిదోది కృష్ణావతారం. దేవకీమాత గర్భం నుంచి ఆయన జన్మించిన తిథి అష్టమి. అదే కృష్ణాష్టమి. కృష్ణావతారంలో ఆయన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించాడు. రేపల్లె గోపాలుడు రాసకేళితో గోపికల జన్మ చరితార్థం చేశాడు. భగవద్గీత ద్వారా జనులకు జ్ఞానామృతాన్ని ధారబోశాడు.

ఇదీ చూడండి: చదరంగం ఆటతో వరద బాధితులకు సాయం

Last Updated : Sep 27, 2019, 11:32 PM IST

ABOUT THE AUTHOR

...view details