తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెన్నెముక సమస్య బాధితులకు ఆపన్నహస్తం

కర్ణాటకలోని 'సమూహ సామర్థ్య సంస్థ' అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. జీవితంలో ఇక నయం కాదనుకున్న వెన్నెముక సంబంధిత వ్యాధులకు చికిత్స అందించి చాలా మంది జీవితాల్లో సంతోషాలను నింపుతోంది.

వెన్నెముక సమస్యకు సంజీవని ఈ పునరావస కేంద్రం

By

Published : Apr 20, 2019, 7:02 AM IST

వెన్నెముక సమస్యకు సంజీవని ఈ పునరావస కేంద్రం

జీవితంలో ఏ సమయంలో ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో గాయాలపాలై మంచానికి పరిమితమవుతున్నారు. ఇందులో వెన్నెముక విరిగి నడవలేని వారూ ఉంటారు. అలాంటి వారికి సంజీవనిలా మారింది 'సమూహ సామర్థ్య సంస్థ.' ప్రమాదాల వల్లే కాదు ఏ ఇతర కారణాల వల్ల వెన్నెముకకు సమస్య వచ్చినా తగ్గిస్తామంటోంది ఈ సంస్థ.

కర్ణాటక హోసూర్​లోని కొప్పల్​లో ఉంది 'సమూహ సామర్థ్య సంస్థ' పునరావస కేంద్రం. వెన్నెముక సంబంధిత వ్యాధితో సతమతమవుతున్న వారికి ఆపన్నహస్తం అందిస్తోంది. ఇక్కడికి వచ్చిన బాధితులకు చికిత్స అందించడం సహా వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తున్నారు శిక్షకుడు మహబూబ్​ హుస్సేన్​.

'వెన్నెముక విరిగిందని చాలా మంది ఈ పునరావాస కేంద్రానికి వస్తారు. ఇక్కడ కనీసం మూడు నెలలు శిక్షణ పొందితే తిరిగి రోజువారి పనులు చేసుకోగలరు. చికత్స కోసం సంస్థకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.'
- మహబూబ్​ హుస్సేన్​, శిక్షకుడు

వెన్నెముక సమస్య ఉన్న వారితో రోజూ వ్యాయామాలు చేయిస్తారు హుస్సేన్​. మొదట్లో కర్రలు, చక్రాల కుర్చీల సహాయంతో వ్యాయామాలు చేస్తుంటారు. ఆ తర్వాత తమ కాళ్లపైనే నిలబడి రోజువారి పనులు చేస్తారు.

జీవితంలో ఇక లేచి నిలపడలేమనుకున్న వారు సంస్థ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి పూర్తి ఫిట్​నెస్​తో సంతోషంగా ఇళ్లకు వెళుతున్నారు.

"నేను దాదాపు ఉత్తర కర్ణాటకలో ఉన్న అన్ని ఆసుపత్రులకు వెళ్లా. కానీ నా వ్యాధికి చికిత్స లభించలేదు. నా జీవితం ఇక ఇంతే అనుకుని బాధపడుతున్న సమయంలోనే యూట్యూబ్​లో ఈ కేంద్రం గురించి తెలుసుకున్నాను. నెల రోజుల నుంచి శిక్షణ పొందుతున్నా. పరిస్థితి ఎంతో మెరుగుపడింది."
--- శశికాంత్​, చికిత్స పొందిన వ్యక్తి

జీవింతలో ఏ సమస్య ఎదురైనా... దానికి పరిష్కారముంటుందని చెప్పడానికి ఇదో ఉదాహరణ.

ఇదీ చూడండి : అత్యవసరానికి 20 రాష్ట్రాల్లో 112 సేవలు!

ABOUT THE AUTHOR

...view details