తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎస్పీ బాలు కోసం శబరిమలలో సంగీత సమర్పణ - శబరిమలలో ఎస్పీ బాలు పూజలు

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోలుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఉషా పూజను నిర్వహించి స్వామివారికి సంగీత సమర్పణ చేసినట్లు ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది.

Special prayers held for SPB at Sabarimala Ayyappa temple
ఎస్పీ బాలు కోసం శబరిమలలో సంగీత సమర్పణ

By

Published : Aug 21, 2020, 7:52 PM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడాలని కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించే 'ఉషా పూజ'ను బాలు పేరిట చేసినట్లు ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది.

సంగీతంతో స్వామివారికి పూజలు!

"నాదస్వరం, తబలా వంటి వాయిద్యాలతో స్వామివారి ముందు సంగీత సమర్పణ చేశాం. బాల సుబ్రహ్మణ్యం ఆలపించిన 'శంకరా.. నాద సరీరా' పాటను దేవస్థాన వాయిద్యకారులు స్వామి వారికి వినిపించారు."

-ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు

కరోనా బారినపడ్డ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం చెన్నై ఎంజీఎం హెల్త్​కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆయనను వెంటిలేటర్​పై ఉంచారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్​లో ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details