తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ 'దేశద్రోహం' కేసుపై 26న విచారణ - నరేంద్ర మోదీ

2016లో ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్​ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్​ విచారణను ఎంపీల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసింది దిల్లీ హైకోర్టు. కేసుపై ఈ నెల 26న విచారణ జరగనుంది.

రాహుల్​ దేశద్రోహ వ్యాఖ్యల కేసుపై 26న విచారణ

By

Published : Apr 23, 2019, 4:44 PM IST

Updated : Apr 23, 2019, 5:43 PM IST

రాహుల్​ 'దేశద్రోహం' కేసుపై 26న విచారణ

2016లో ప్రధాని మోదీపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహాన్ని తలపించేలా ఉన్నాయని దాఖలైన పిటిషన్​ను ఎంపీల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసింది దిల్లీ కోర్టు. ఈ వ్యాజ్యంపై ఈనెల 26న విచారణ జరగనుంది.

​దిల్లీలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా మోదీపై రాహుల్​ తీవ్ర విమర్శలు చేశారు. ఇలా మాట్లాడడం దేశద్రోహమే అవుతుందని ఆరోపిస్తూ దిల్లీ కోర్టులో కేసు దాఖలైంది. రాహుల్​పై దేశద్రోహం కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్​ న్యాయస్థానాన్ని కోరారు. ప్రజాప్రతినిధుల కేసుల కోసం దిల్లీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టు ఈ వ్యాజ్యంపై వాదనలు విననుంది.

ఇదీ చూడండీ: బిల్కిస్​ బానోకు అర కోటి పరిహారం, ఉద్యోగం

Last Updated : Apr 23, 2019, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details