తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోమవారం వరకు సీబీఐ కస్టడీలో చిదంబరం - చిదంబరం

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టు కస్టడీకి అనుమతించింది.

చిదంబరం

By

Published : Aug 22, 2019, 7:17 PM IST

Updated : Sep 27, 2019, 9:56 PM IST

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి చుక్కెదురైంది. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలన్న సీబీఐ అభ్యర్థనకు కోర్టు అంగీకారం తెలిపింది.

కేసు విచారణలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ విజ్ఞప్తి చేసింది. ఈనెల 26 వరకు కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో కుటుంబసభ్యులు, న్యాయవాదులు చిదంబరంను రోజూ 30 నిమిషాల పాటు కలిసేందుకు అనుమతిచ్చింది కోర్టు.

ఇదీ చూడండి: కోర్టులో చిదంబరం: 5 రోజుల కస్టడీ కోరిన సీబీఐ

Last Updated : Sep 27, 2019, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details