కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణలో జరిగిన ఓ వివాహ వేడుక ప్రత్యేకంగా నిలిచింది. వధువు కుటుంబం డిమాండ్ మేరకు పెళ్లికొడుకు స్వయంవరంలో పాల్గొన్నాడు.
కర్ణాటక స్వయంవరంలో శివధనుర్భంగం.!
రామాయణంలో సీతాస్వయంవర ఘట్టం అందరికీ తెలిసిందే. రామచంద్రమూర్తి సీతామాతను పరిణయమాడటానికి శివధనుర్భంగం చేస్తాడు. కర్ణాటకలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇలాంటి స్వయంవరమే ఏర్పాటు చేశారు. పెళ్లికి వచ్చిన వారందరికీ మరోసారి సీతారాముల కల్యాణాన్ని గుర్తుచేశారు.
కర్ణాటక స్వయంవరంలో శివధనుర్భంగం.!
గోకర్ణ భద్రకాళీ ఆలయ పురోహితుడైన శ్రీధర్ కుమార్తె నిషా వివాహంలో ఈ స్వయంవరం జరిగింది. ఎంతోమంది యువకులు ధనుస్సును విరిచే ప్రయత్నం చేసినా చివరికి వరుడు గిరీశ్ శివధనుర్భంగం చేసి వధువును పరిణయమాడాడు.
నేటి యువత మర్చిపోతున్న హైందవ ధర్మాన్ని, రామాయణాన్ని గుర్తుచేయడానికే ఈ స్వయంవరం ఏర్పాటు చేసినట్లు పెళ్లివారు తెలిపారు.
- ఇదీ చూడండి: బడా రుణ ఎగవేతదారుల పేర్లు ఇవ్వండి: సీఐసీ