తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ది చిల్లర రాజకీయం- సోనియా డిమాండ్​ హాస్యాస్పదం' - ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర మంత్రి.

దిల్లీ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించింది భాజపా. అలాంటి ప్రకటనలు చేయటం దురదృష్టకరమని, సోనియా డిమాండ్​ హాస్యాస్పదమని పేర్కొంది. శాంతి పునరుద్ధరించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరింది.

Sonia politicising violence
ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర మంత్రి.

By

Published : Feb 26, 2020, 3:19 PM IST

Updated : Mar 2, 2020, 3:32 PM IST

'కాంగ్రెస్​ది చిల్లర రాజకీయం- సోనియా డిమాండ్​ హాస్యాస్పదం'

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఎదురుదాడికి దిగింది అధికార భాజపా. దిల్లీ అల్లర్లకు కేంద్రమే బాధ్యత వహించాలన్న సోనియా వ్యాఖ్యలను ఖండించారు కేంద్రమంత్రి, భాజపా నేత ప్రకాశ్​ జావడేకర్. కాంగ్రెస్​ ప్రకటన దురదృష్టకరమన్నారు.

అల్లర్ల సమయంలో శాంతిని పునరుద్ధరించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని, అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వాన్ని తప్పుబట్టడం చిల్లర రాజకీయం అవుతుందని మండిపడ్డారు జావడేకర్. హింసపై రాజకీయం చేయడం ఏమాత్రం తగదని హితవు పలికారు.

"అమిత్​ షా ఎక్కడున్నారని వారు అడిగారు. ఆయన నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అందులో కాంగ్రెస్​ నాయకులు కూడా ఉన్నారు. ఆమ్​ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి సహా ఇతర నేతలు ఉన్నారు. ఘటనలపై పోలీసులకు దిశా నిర్దేశం చేశారు హోంమంత్రి. వారిలో ధైర్యాన్ని నింపారు. కాంగ్రెస్​ ప్రకటనలు పోలీసుల మనోధైర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. "

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర మంత్రి.

దిల్లీలో పరిస్థితి అదుపులోకి వస్తోందని చెప్పారు జావడేకర్. హింస చెలరేగడం వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతుందని గుర్తుచేశారు. హింసకు పాల్పడిన వారిని వదిలేదిలేదని స్పష్టం చేశారు.

గతేడాది ఇదే రోజు జరిగిన బాలాకోట్ ఆపరేషన్​ సమయంలో కాంగ్రెస్​ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు కేంద్ర మంత్రి. అప్పుడు కూడా కేంద్రంపై ఆరోపణలు చేశారని గుర్తుచేశారు.

ఇదీ చూడండి: 'అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత- షా రాజీనామా చేయాలి'

Last Updated : Mar 2, 2020, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details