యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ వ్యక్తిగత ఆస్తుల విలువ 2014తో పోల్చితే రూ.2కోట్ల 54లక్షలు పెరిగింది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ రూ.11.82కోట్లుగా ఎన్నికల సంఘానికి నామపత్రంతోపాటు సమర్పించిన అఫిడవిట్లో తెలిపారు సోనియా. ఇందులో రూ.4.29కోట్లు విలువ చేసే చరాస్థులు ఉన్నాయి.
తన కుమారుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రూ.5లక్షలు అప్పుగా ఇచ్చినట్లు ప్రమాణపత్రంలో పేర్కొన్నారు సోనియా. రూ.60లక్షల నగదు, రూ.160.5లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు. తనపై భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన క్రిమినల్ కేసు ఉందని నామపత్రంతో పాటు ఇచ్చిన అఫిడవిట్లో పొందుపరిచారు సోనియా.