తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైద్య పరీక్షలు పూర్తి- స్వదేశానికి సోనియా, రాహుల్​ - పార్లమెంటు సమావేశాలు

వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన సోనియా గాంధీ.. తనయుడు రాహుల్​ గాంధీతో కలిసి స్వదేశానికి వచ్చారు.

Sonia Gandhi, Rahul return from abroad after her medical check-up
వైద్య పరీక్షల అనంతరం స్వదేశానికి సోనియా

By

Published : Sep 22, 2020, 7:29 PM IST

సాధారణ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చారు. మంగళవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి 2 రోజుల ముందు తనయుడు రాహుల్​ గాంధీతో కలిసి అమెరికా వెళ్లారు సోనియా. కరోనా మహమ్మారి కారణంగా.. ఇప్పటివరకు ఆమె అమెరికా ప్రయాణం వాయిదా పడి వైద్య పరీక్షలు ఆలస్యం అయ్యాయని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

అమెరికా వెళ్లేముందు కాంగ్రెస్​లో సంస్థాగత మార్పులు చేశారు సోనియా​ గాంధీ.

ABOUT THE AUTHOR

...view details