పార్లమెంటులో కాంగ్రెస్ సేనానిగా మరోసారి సోనియా గాంధీనే నియమితులయ్యారు. దిల్లీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీని ఎన్నుకున్నారు ఎంపీలు. సోనియా పేరును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించగా సభ్యులు అందరూ ఆమోదం తెలిపారు.
యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ... ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 నుంచి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు.
12 కోట్ల 13 లక్షల మంది ఓటర్లు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు సోనియా గాంధీ. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.