తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పబ్​జీ కోసం కన్నతండ్రినే కడతేర్చిన కుమారుడు - తండ్రి

మొబైల్​ గేమ్ పబ్​జీ ఎంతటి దుష్ప్రభావం కలిగిస్తోందో చెప్పే మరో సంఘటన ఇది. ఆట కోసం కన్నతండ్రినే ఓ కుమారుడు హత్య చేసిన ఉదంతం కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. పబ్​జీ ఆడేందుకు ఇంటర్నెట్​ డేటా కోసం డబ్బులు ఇవ్వలేదని నిద్రిస్తున్న సమయంలో తండ్రిని కత్తితో చంపాడు. దేహాన్ని మూడు ముక్కలు చేశాడు.

పబ్​జీ కోసం తండ్రినే ముక్కలుగా నరికిన కుమారుడు

By

Published : Sep 9, 2019, 10:54 AM IST

Updated : Sep 29, 2019, 11:16 PM IST

పంచప్రాణాలుగా గుండెల్లో పెట్టుకుని సాకిన తండ్రి ప్రాణాన్నే తీశాడు ఓ ప్రబుద్ధుడు. అతికిరాతకంగా మృతదేహాన్ని ముక్కలు చేశాడు. అంత కర్కశత్వం ఎందుకంటారా...? పబ్​జీ ఆడేందుకు మొబైల్ డేటా రీఛార్జ్​కు డబ్బులు ఇవ్వనందుకు.

కర్ణాటకలోని బెళగావి జిల్లా కాకతిలో జరిగిందీ దారుణం. రఘువీర్ కమ్మార్ అనే 21 ఏళ్ల యువకుడు పబ్​జీ ఆటకు బానిసయ్యాడు. మొబైల్​లో ఆ ఆట ఆడాలంటే డేటా ప్యాక్​ అవసరం. ఇంటర్నెట్ రీఛార్జ్ కోసం డబ్బులు ఇవ్వమని పదేపదే తండ్రి శంకరప్పను వేధించేవాడు రఘువీర్. పబ్​జీ ఆడొద్దని అనేక సార్లు కుమారుడిని వారించాడు శంకరప్ప.

తండ్రిపై కక్ష పెంచుకున్న నిందితుడు రఘువీర్ రాత్రి సమయంలో నిద్రిస్తుండగా శంకరప్పను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆయన శరీరాన్ని మూడు ముక్కలుగా నరికాడు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడు శంకరప్ప పోలీస్ శాఖలో పనిచేసేవాడు.

ఇదీ చూడండి: గర్భిణీని 5కి.మీ దూరం మోస్తూ ఆస్పత్రికి నడక

Last Updated : Sep 29, 2019, 11:16 PM IST

ABOUT THE AUTHOR

...view details