ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానానికి కేంద్ర మంత్రి, భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ నామపత్రం దాఖలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భాజపా సీనియర్ నాయకులతో కలిసి ర్యాలీగా అమేఠీ పరిపాలనా కార్యాలయానికి చేరుకున్నారు ఇరానీ.
తొలుత ఈ నెల 17న నామపత్రం దాఖలు చేయాలని నిర్ణయించినప్పటికీ... మహవీర్ జయంతి సందర్భంగా నామినేషన్ తేదీని మార్చుకున్నారు.