తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రుతుపవనాల రాక మరింత ఆలస్యం' - వాతావరణ

దేశానికి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుందని స్కైమెట్​ సంస్థ తెలిపింది. జూన్​ 7న కేరళను తాకనున్నట్లు ప్రకటించింది. గతంలో జూన్​ 4న వస్తాయని ప్రకటించినప్పటికీ.. వాతావరణ మార్పుల దృష్ట్యా మరింత ఆలస్యంగా వస్తాయని తెలిపింది.

'రుతుపవనాల రాక మరింత ఆలస్యం'

By

Published : Jun 1, 2019, 10:21 PM IST

Updated : Jun 1, 2019, 11:55 PM IST

'రుతుపవనాల రాక మరింత ఆలస్యం'

వరుణుడి రాకకోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఈ ఏడాది నిరాశ తప్పేలా లేదు. దేశానికి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం కానుందని వాతావరణ సంస్థ స్కైమెట్​ ప్రకటించింది. జూన్​ 7న కేరళ తీరాన్ని తాకుతాయని తెలిపింది. గతంలో జూన్​ 4నే వస్తాయని ప్రకటించినప్పటికీ.. వాతావరణ మార్పుల దృష్ట్యా మరింత ఆలస్యంగా వస్తాయని తెలిపింది

అండమాన్​ నికోబార్​ దీవులకు రుతుపవనాలు మే 18న వస్తాయని గతంలో పేర్కొంది స్కైమెట్​. అనంతరం మే 20న వస్తాయని తెలిపింది. అయితే ఇప్పటికీ అండమాన్ దీవులను పలకరించకపోవడం గమనార్హం.

భారత వాతావరణ శాఖ సైతం రుతుపవనాలు జూన్​ 6న కేరళను తాకుతాయని ప్రకటించింది.

లోటు వర్షాపాతం..

ఈ ఏడాది మధ్య, తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల్లో... దక్షిణ ద్వీపకల్పం, వాయవ్య భారత ప్రాంతాలతో పోల్చితే లోటు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది స్కైమెట్. దేశవ్యాప్తంగా సాధారణం కంటే లోటు వర్షపాతమే ఉంటుందని గతంలో తెలిపింది.

ఇదీ చూడండి:తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చేదు కబురు

Last Updated : Jun 1, 2019, 11:55 PM IST

ABOUT THE AUTHOR

...view details