తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసు చర్యలకు నిరసనగా బైఠాయించిన ప్రియాంక గాంధీ

Jamia Millia Islamia
జామియాలో మళ్లీ ఉద్రిక్తత.. ఇళ్లకు విద్యార్థులు

By

Published : Dec 16, 2019, 11:04 AM IST

Updated : Dec 16, 2019, 4:44 PM IST

16:40 December 16

ప్రియాంక గాంధీ చేపట్టిన నిరసన ప్రదర్శనలో.. ఇతర కాంగ్రెస్​ సీనియర్​ నేతలు కేసీ వేణుగోపాల్​, ఏకే ఆంటోనీ, పీఎల్​ పునియా, అహ్మద్​ పటేల్ సహా​ ఇతర నాయకులు పాల్గొన్నారు. 

16:27 December 16

పోలీసు చర్యలపై ప్రియాంక గాంధీ నిరసన..

జామియా మిలియా ఇస్లామియా ,అలీగఢ్​ ముస్లిం యూనివర్సిటీ లో నిరసనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దాడిని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిరసనకు దిగారు. దిల్లీ ఇండియా గేట్​ సమీపంలో ఇతర కాంగ్రెస్​ నేతలతో కలిసి బైఠాయించారు. 

14:06 December 16

ఎలాంటి ఆందోళన వద్దు...

దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దేశ పౌరులు ఎవరూ ఈ చట్టంపై ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ చట్టం ఏ మతాన్ని ఇబ్బంది కలిగించబోదన్నారు. ఎన్నో ఏళ్లుగా మత పీడన ఎదుర్కొన్న వారికి ఉపశమనం కోసమే ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు వివరించారు. 

ఇది భారత అభ్యున్నతి కోసం అందరూ కృషి చేయాల్సిన సమయమని... స్వార్థ శక్తుల వలలో పడి ప్రజలు విడిపోరాదని మోదీ తెలిపారు.

13:59 December 16

పోలీసులకు అనుమతి ఎవరిచ్చారు..?

  • జామియా వర్సిటీలోకి వెళ్లేందుకు పోలీసులకు అనుమతి ఎవరిచ్చారు: ఆజాద్‌
  • నిన్న వర్సిటీలో పోలీసుల తీరు అత్యంత అమానవీయంగా ఉంది: ఆజాద్‌
  • పోలీసులు వర్సిటీలోకి వెళ్లి విద్యార్థుల వెంటబడ్డారు: గులాంనబీ ఆజాద్‌
  • నిన్న దిల్లీ యూనివర్సిటీలో తీవ్రమైన ఆందోళనలు జరిగాయి: ఆజాద్‌
  • ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి: ఆజాద్‌
  • ప్రధాని సహా మొత్తం మంత్రివర్గం ఘటనలకు పూర్తి బాధ్యత వహించాలి: ఆజాద్‌
  • అంతర్జాలం, మొబైల్ సేవలు నిలిపివేసి బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారు: ఆజాద్‌
     

13:34 December 16

కేంద్ర హోం మంత్రిని కలవనున్న కేజ్రీవాల్​..!

  • దిల్లీలో శాంతిభద్రతలపై ఆందోళనగా ఉంది:సీఎం అరవింద్‌ కేజ్రీవాల్
  • కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసేందుకు సమయం కోరాను:కేజ్రీవాల్‌
  • దిల్లీలో శాంతిభద్రతల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరతాను:కేజ్రీవాల్‌

13:33 December 16

జామియాలో కొనసాగుతున్న ఆందోళన...

  • జామియా విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన
  • రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్న విద్యార్థులు
  • పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు
  • పోలీసుల లాఠీఛార్జికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విద్యార్థులు
  • జామియా వర్సిటీ వీసీని కలిసిన అధ్యాపకులు,విద్యార్థులు
  • వీసీతో చర్చల అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటించనున్న విద్యార్థులు

13:28 December 16

రోడ్డెక్కిన దీదీ.. పౌర చట్టానికి వ్యతిరేకంగా మెగా ర్యాలీ

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. నిరసన ప్రదర్శన చేపట్టారు. రోడ్డుపై ర్యాలీగా బయల్దేరారు. 

12:56 December 16

ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలి: జామియా వైస్​ ఛాన్సలర్​

''యూనివర్సిటీ క్యాంపస్​లోకి పోలీసుల ప్రవేశంపై.. మేం ఎఫ్​ఐఆర్​ దాఖలు చేస్తాం. మేం మా జరిగిన ఆస్తి నష్టాన్ని పూడ్చుతారేమా.. కానీ విద్యార్థులపై జరిగింది మాత్రం అంతకుమించి. దీనిపై మేం ఉన్నత స్థాయి విచారణ కోరుతున్నాం.''

        - నజ్మా అఖ్తర్​, జామియా వైస్​ ఛాన్సలర్​

  • నిన్నటి ఘటన దురదృష్టకరం:జామియా వర్సిటీ వీసీ నజ్మా అక్తర్‌
  • వర్శిటీలో చాలా ఆస్తినష్టం జరిగింది:ఉపకులపతి నజ్మా అక్తర్‌
  • నిన్నటి ఘటనలో పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతున్నా:వీసీ నజ్మా అక్తర్‌
  • ఉన్నత స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరతాం:వీసీ నజ్మా అక్తర్‌
  • నిన్నటి ఘటనలో విద్యార్థులెవరూ చనిపోలేదు:వీసీ నజ్మా అక్తర్‌
  • ఎలాంటి వదంతులు నమ్మవద్దు:ఉపకులపతి నజ్మా అక్తర్‌
  • గాయపడిన వారిలో ఎక్కువమంది మా విద్యార్థులే:వీసీ నజ్మా అక్తర్‌
  • బయటి వ్యక్తుల ఆందోళనలను అదుపు చేయడం మా విధి కాదు:వీసీ
  • మా విద్యార్థులయితే మేము అదుపు చేస్తాం:జామియా వర్సిటీ వీసీ
  • ఘటనపై కేంద్ర మానవ వనరులశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తాం:వీసీ
  • బయటి వ్యక్తులెవరూ వర్సిటీలోకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం:వర్సిటీ వీసీ

12:52 December 16

జామియా మిలియా ఇస్లామియా వైస్​ ఛాన్సలర్​ మీడియా సమావేశం

''యూనివర్సిటీలో చాలా ఆస్తి నష్టం జరిగింది. వీటన్నింటినీ ఎలా భర్తీ చేస్తారు? మా భావోద్వేగాలకు తీరని నష్టం వాటిల్లింది. నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే.. ఎలాంటి పుకార్లను నమ్మకండి.''

          - నజ్మా అఖ్తర్​, జామియా వైస్​ ఛాన్సలర్​

12:12 December 16

జామియా వర్శిటీ అల్లర్లపై 2 కేసులు నమోదు

పౌర చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయం, పరిసర ప్రాంతాల్లో చెలరేగిన హింస ఘటనలపై రెండు కేసులు నమోదు చేశారు దిల్లీ పోలీసులు. జామియా నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఒకటి, న్యూ ఫ్రెండ్స్​ కాలనీ పోలీస్​ స్టేషన్​లో మరో కేసు నమోదయింది.

జామియా ఘటనపై దిల్లీ హైకోర్టులో పిటిషన్​..

జామియా ఇస్లామియా వర్శిటీలోని విద్యార్థులపై ఆదివారం రాత్రి పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది.

అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోరగా అందుకు నిరాకరించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీఎన్​ పాటిల్​ నేతృత్వంలోని ధర్మాసనం. జామియ ఘటనపై జుడీషియల్​ దర్యాప్తు చేపట్టాలని కోరారు పిటిషనర్లు. గాయపడిన విద్యార్థులకు సరైన వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని విన్నవించారు. 

11:58 December 16

హైదరాబాద్​ ఎంఏఎన్​యూయూలో ఆందోళనలు


పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్​లోని మౌలాన ఆజాద్​ జాతీయ ఉర్దు విశ్వవిద్యాలయం (ఎంఏఎన్​యూయూ)లో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దిల్లీ జామియా ఇస్లామియా విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జి​ని ఖండించారు. వారికి మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. 

11:34 December 16

రాళ్లు రువ్విన విద్యార్థులు...

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని నద్వా కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. పోలీసులపై ఆగ్రహించిన విద్యార్థులు రాళ్లు రువ్వారు.

10:30 December 16

రోడ్డెక్కిన దీదీ.. పౌర చట్టానికి వ్యతిరేకంగా మెగా ర్యాలీ

జామియాలో మళ్లీ ఉద్రిక్తత.. ఇళ్లకు విద్యార్థులు

పౌరసత్వ చట్టంపై చెలరేగిన అల్లర్లతో దిల్లీ నగరం దద్దరిల్లింది. జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. 

పోలీసులకు వ్యతిరేకంగా నిరసన..

వర్శిటీ లోపలికి పోలీసులు ప్రవేశించి విద్యార్థులపై లాఠీఛార్జి​ చేయటాన్ని నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  వర్శిటీ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. 

జనవరి 5 వరకు సెలవులు..

ఆందోళనల కారణంగా పరీక్షలను వాయిదా వేసిన విశ్వవిద్యాలయ యాజమాన్యం జనవరి 5 వరకు శీతాకాల సెలవులు ప్రకటించింది.

ఇళ్లకు విద్యార్థులు..

అల్లర్ల కారణంగా వర్శిటీ ప్రాంగణంలోనూ తమకు రక్షణ లేదని నిర్ణయించుకున్న చాలా మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పరిస్థితులు సద్దుమణిగేలా కనిపించకపోవటం వల్ల ఇప్పటికే విద్యార్థినులు క్యాంపస్​ వదిలి వెళుతున్నారు. 

ఇదీ జరిగింది

పౌర చట్టంపై ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీసిన క్రమంలో ఆదివారం వర్శిటీలోకి పోలీసులు ప్రవేశించారు. ఆందోళనకారులు, విద్యార్థులపై లాఠీఛార్జి​ చేశారు. ఈ క్రమంలో వర్సిటీ ప్రాంగణం రణరంగంగా మారింది. 60 మంది వరకు గాయపడ్డారు.
 

Last Updated : Dec 16, 2019, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details