తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నడ ఎంపీ ప్రసంగానికి వెంకయ్య అనువాదం - kannada

స్థానిక భాషలో బ్యాంకు నియామక పరీక్షలు నిర్వహించాలన్న ఎంపీల డిమాండ్​ను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​. స్థానిక భాష అంశంపై లోక్​సభ ఎంపీలతో సమావేశమైనట్లు తెలిపారు. ఈ ప్రశ్నను ఎంపీ కన్నడ భాషలో అడగగా... రాజ్యసభ ఛైర్మన్​ ఆంగ్లంలోకి అనువదించారు.

కన్నడ ఎంపీ ప్రసంగానికి వెంకయ్య అనువాదం

By

Published : Jun 27, 2019, 3:35 PM IST

బ్యాంకు పోటీ పరీక్షలు స్థానిక భాషలో నిర్వహించాలని దక్షణాది రాష్ట్రాల ఎంపీలు రాజ్యసభలో డిమాండ్​ చేశారు. ఎంపీల డిమాండ్​ను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​.

రాజ్యసభలో జీరో అవర్​ సందర్భంగా స్థానిక భాష అంశాన్ని లేవనెత్తారు కాంగ్రెస్​ ఎంపీ జీసీ చంద్రశేఖర్​. కన్నడలో మాట్లాడుతూ.. భారతీయ బ్యాంకు సేవల పరీక్షలు, ఇతర నియామక పరీక్షలు ఆంగ్లం, హిందీతో పాటు కన్నడలో నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

ఆ సమయంలో చంద్రశేఖర్​ వ్యాఖ్యలను తర్జుమా చేసేందుకు ఎవరూ లేరు. రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు అనువదించి సభ్యులకు వివరించారు.

కాంగ్రెస్​ ఎంపీ చంద్రశేఖర్​ లేవనెత్తిన స్థానిక భాష అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ వివరణ ఇచ్చారు.

రాజ్యసభలో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​

"కర్ణాటక సభ్యుల ఆందోళనను పూర్తిగా అర్థం చేసుకున్నాను. కర్ణాటక నుంచి ఎంపికైన లోక్​సభ సభ్యులతో ఈ అంశంపై సమావేశమయ్యాను. అన్ని రాష్ట్రాల స్థానిక భాషకు సంబంధించిన సమస్య అంశాన్ని సభ్యులు లేవనెత్తారు. ఈ అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్​ సేవలు అందించేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. దీనిని పరిశీలిస్తాం."

- నిర్మలా సీతారామన్​, ఆర్థిక మంత్రి.

ఇదీ చూడండి: నీరవ్ మోదీకి మరో షాక్​- స్విస్​ ఖాతాలు సీజ్

ABOUT THE AUTHOR

...view details