తెలంగాణ

telangana

ETV Bharat / bharat

1984 అల్లర్లు: కమల్​నాథ్​ను వీడని చిక్కులు! - మధ్యప్రదేశ్

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన 7 కేసులను మళ్లీ దర్యాప్తు చేయనుంది ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).  ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​కి చిక్కులు తప్పేలాలేవు.

1984 అల్లర్లు: కమల్​నాథ్​ను వీడని చిక్కులు!

By

Published : Sep 9, 2019, 9:35 PM IST

Updated : Sep 30, 2019, 1:23 AM IST

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను నీడలా వెంటాడుతోంది. కమల్‌నాథ్‌కు వ్యతిరేకంగా దాఖలైన కేసులో మళ్లీ దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక దర్యాప్తు బృందానికి అనుమతులిచ్చింది. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన 7 కేసుల్లో తిరిగి దర్యాప్తు ప్రారంభించేందుకు హోంశాఖ నోటిఫికేషన్​ జారీ చేసింది.

సిట్​ ముందుకు ఇద్దరు సాక్ష్యులు..

నోటిఫికేషన్​ విడుదల తర్వాత మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​పై ఆరోపణలు చేశారు దిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మంజిందర్​ సింగ్​ సిర్సా. అల్లర్ల కేసులో సంబంధం ఉన్న ఐదుగురికి కమల్​నాథ్​ ఆశ్రయం కల్పించారని ఆరోపించారు. సరైన ఆధారాలు లేకపోవటం వల్ల వారంతా కేసు నుంచి బయటపడ్డారని తెలిపారు సింగ్​. ఈ కేసులో ఇద్దరు సాక్ష్యులు సిట్​ ముందుకు వచ్చి అల్లర్లలో కమల్​నాథ్​ పాత్రను తెలపనున్నారని వెల్లడించారు.

సిక్కు వ్యతిరేక అల్లర్లలో కమల్‌నాథ్‌ సహా ఇతర కాంగ్రెస్‌ నేతలు జగదీష్‌ టైట్లర్‌, సజ్జన్‌ కుమార్‌ నిందితులుగా ఉన్నారు. గతేడాది సజ్జన్​ కుమార్​కు ​ జీవిత ఖైదు పడింది.

పబ్లిక్​ నోటీసులు..

సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి సమాచారం అందించాలని పబ్లిక్​ నోటీసులు జారీ చేసింది దర్యాప్తు బృందం. వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సమాచారం అందించవచ్చని తెలిపింది.

80 కేసులు పునఃప్రారంభం..

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులకు సంబంధించి జీబీ మాథుర్​ కమిటీ సిఫార్సుల మేరకు 2015 ఫిబ్రవరి 12న సిట్​ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన అల్లర్లపై 650 కేసులు నమోదయ్యాయి. ఇందులో 80 కేసులను ఇప్పటికే పునఃప్రారంభించింది సిట్​.

ఇదీ చూడండి: సెప్టెంబర్‌ 27న ఐరాసలో మోదీ ప్రసంగం

Last Updated : Sep 30, 2019, 1:23 AM IST

ABOUT THE AUTHOR

...view details