తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ రైలు ప్రమాదంపై మోదీ, రాహుల్​ దిగ్భ్రాంతి - ప్రధాని

సీమాంచల్​ ఎక్స్​ప్రెస్ ప్రమాదంపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

బిహార్​ రైలు ప్రమాదంపై మోదీ, రాహుల్​ దిగ్భ్రాంతి

By

Published : Feb 3, 2019, 12:52 PM IST

సీమాంచల్ ఎక్స్​ప్రెస్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్రమోదీ.

"సీమాంచల్ ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పిందన్న వార్త తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి"-ట్విట్టర్​లో నరేంద్రమోదీ

రాహుల్ విచారం..

సీమాంచల్​ ఎక్స్​ప్రెస్​ ప్రమాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

"బిహార్ రైలు ప్రమాద వార్త బాధ కలిగిచింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి"-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

ఈ తెల్లవారుజామున బిహార్ జోగ్బనీ నుంచి దిల్లీ వెళుతున్న సీమాంచల్ ఎక్స్​ప్రెస్​ హజీపూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా 29 మంది క్షతగాత్రులయ్యారు. మరో 27మందికి స్వల్పగాయాలయ్యాయి. మొత్తం 11 బోగీలు పట్టాలుతప్పాయి.

ABOUT THE AUTHOR

...view details