దేశంలో మరో టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ టీకా తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్‌కల్లా ‘'కొవొవాక్స్’' టీకాను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీరం సీఈవో అదర్ పూనావాలా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
"నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవొవాక్స్’ వ్యాక్సిన్ మంచి ఫలితాలనిస్తోంది. భారత్‌లో ట్రయల్స్ కోసం ఇప్పటికే అనుమతులు కోరాం. కొవొవాక్స్‌ను జూన్ కల్లా అందుబాటులోకి తీసుకొస్తామని ఆశిస్తున్నాం.’’"
--అదర్ పూనావాలా, సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో
కొవొవాక్స్’ టీకాపై భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సీరం సిద్ధమైంది. దీనిని అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు కోరినట్లు సీరం సంస్థ శుక్రవారం తెలిపింది.