గోసంరక్షణ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కౌ క్యాబినెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. బుధవారం తెలిపారు. పశుసంరక్షణ, అటవీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు ఇందులో భాగస్వాములవుతాయని చెప్పారు.
"రాష్ట్రంలోని ఆవుల సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రి వర్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పశుసంరక్షణ, అటవీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, హోం, రైతు సంరక్షణ శాఖలు ఇందులో భాగస్వామ్యులవుతాయి. మెదటి సమావేశం నవంబర్ 22న మధ్యాహ్నం 12 గంటలకు అగర్ మల్వా జిల్లాలోని ఆవుల అభయారణ్యం వద్ద జరుగుతుంది."