తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహాభారత యుద్ధం కంటే కరోనాపై పోరే క్లిష్టం' - shiv sena news today

ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించింది శివసేన. కరోనా పోరులో 21 రోజుల్లో విజయం సాధిస్తామని మోదీ చెప్పిన మాటలను గుర్తు చేసింది. 100 రోజులు దాటినా పరిస్థితి అంతకంతకూ తీవ్రమవుతుందే తప్ప తగ్గడం లేదని సామ్నా పత్రికలో వ్యాసం ప్రచురించింది. కురుక్షేత్ర యుద్ధం కంటే కరోనాపై పోరే చాలా క్లిష్టమని తెలిపింది.

Shiv Sena targets PM Modi over COVID-19 crisis
'మహాభారత యుద్ధం కంటే కరోనాపై పోరే క్లిష్టం'

By

Published : Jul 7, 2020, 3:54 PM IST

కరోనా పోరును మహాభారత యుద్ధం కంటే చాలా క్లిష్టమైనదిగా అభివర్ణించింది శివసేన. వైరస్ కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే భారత్​ మూడో స్థానానికి చేరడంపై ఆందోళన వ్యక్తం చేసింది. 2021 వరకు కరోనాపై పోరాటం తప్పదని, అప్పటి వరకు వ్యాక్సిన్​ వచ్చే పరిస్థితి లేదని తన అధికారిక పత్రిక సామ్నాలో వ్యాసం ప్రచురించింది శివసేన.

కరోనాపై జరిగే యుద్ధంలో 21 రోజుల్లో విజయం సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించింది సేన.

"మహాభారత యుద్ధం 18 రోజుల పాటు సాగింది. కరోనాపై పోరులో 21 రోజుల్లో విజయం సాధిస్తామని మోదీ అన్నారు. ఇప్పుడు 100 రోజులు దాటింది. అయినా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వైరస్​పై యుద్ధం చేస్తున్న యోధులు అలసిపోయారు. కురుక్షేత్ర యుద్ధం కంటే కరోనాపై సమరమే చాలా క్లిష్టమైంది. కేసుల సంఖ్యలో రష్యాను అధిగమించి మూడో స్థానానికి చేరడం ఆందోళనకరం. మహారాష్ట్రలో కరోనా రోగులు పెద్ద సంఖ్యలో కోలుకుంటున్నారు. కానీ కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. లాక్​డౌన్ ఆంక్షలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయో? ఆంక్షలు సడలిస్తే మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. పరిశ్రమలు, ఆర్థికవ్యవస్థ, జీవనశైలిపై ప్రభావం పడుతున్నా సరే కరోనాపై పోరును నిర్విరామంగా కొనసాగించాలి."

-సామ్నా పత్రికలో శివసేన

ఇదీ చూడండి: సైన్యంలో మహిళా కమిషన్ ఏర్పాటుకు మరో నెల గడువు

ABOUT THE AUTHOR

...view details