రానున్న బిహార్ ఎన్నికల్లో శివసేన బరిలో దిగే అవకాశముంది. 30-40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే యోచనలో శివసేన ఉన్నట్టు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
"50 సీట్లల్లో పోటీ చేయాలని మా ప్రజలు కోరుతున్నారు. కానీ మేము 30-40 స్థానాల్లో బరిలో దిగాలని అనుకుంటున్నాం."
--- సంజయ్ రౌత్, శివసేన ఎంపీ.
'మాజీ డీజీజీ గుప్తేశ్వర్ పాండేపై పోటీ చేస్తారా?' అన్న ప్రశ్నకు... 'వేచి చూడండి' అంటూ జవాబు చెప్పారు రౌత్. త్వరలో తాను బిహార్‌కు వెళతానని, ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం అక్కడే చెబుతానని పేర్కొన్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని పాండే డిమాండ్ చేశారు. అప్పటి నుంచి పాండేను శివసేన లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధిస్తోంది.
గత నెలలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన పాండే.. ఆ తర్వాత జేడీయూలో చేరారు.
ఇదీ చూడండి:-'బిహార్‌లో ఎన్డీఏ గెలుపునకు అసలు కారణం ఆర్జేడీ'