తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్​-2 ప్రయోగం మళ్లీ ఎప్పుడు?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 అనూహ్యంగా ఆగిపోయింది. వాహకనౌక  ‘జీఎస్‌ఎల్వీ మార్క్‌3’లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది.  మళ్లీ ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్నది తెలియాల్సి ఉంది.

By

Published : Jul 15, 2019, 4:04 AM IST

చంద్రయాన్​-2 ప్రయోగం మళ్లీ ఎప్పుడు?

సాంకేతిక లోపం కారణంగా భారత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్​ చంద్రయాన్​-2 నిలిచిపోయింది. యావత్​ భారత్​ జాబిల్లి యాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూసింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు షార్‌ నుంచి ‘జీఎస్‌ఎల్వీ మార్క్‌3-ఎం1’ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లి ఉండాలి. అయితే ప్రయోగం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. తిరిగి ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మళ్లీ ఎప్పుడు..?

సాధారణంగా నిర్దిష్ట సమయం (లాంచ్‌ విండో)లోనే వ్యోమనౌకను ప్రయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ప్రయోగించలేకపోతే మళ్లీ అనువైన సమయం వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే. ప్రస్తుత లాంచ్‌ విండో (సోమవారం తెల్లవారుజాము)లో ప్రయోగాన్ని పూర్తిచేసేందుకు ఇస్రో తీవ్రంగా శ్రమించినప్పటికీ నిరాశే ఎదురైంది. మళ్లీ ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు అనువుగా ఈ నెలలో కేవలం 1 నిమిషం నిడివి ఉన్న లాంచ్‌ విండోలే అందుబాటులో ఉన్నాయి. సోమవారం నాటి లాంచ్‌ విండో నిడివి 10 నిమిషాలు కావడం గమనార్హం. సాంకేతిక లోపాన్ని అధిగమించి...సమాలోచనలు జరిపి ఇస్రో మళ్లీ ప్రయోగ తేదీ ప్రకటించనుంది.

ABOUT THE AUTHOR

...view details