తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ అంతర్గత భద్రతపై అమిత్​ షా సమీక్ష

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలపై సమీక్షించారు. జమ్ము కశ్మీర్​ సహా పలు అంశాలపై ఉన్నతాధికారులు షాకు వివరించారు. హోంమంత్రిగా అమిత్​ షా శనివారమే బాధ్యతలు చేపట్టారు.

దేశ అంతర్గత భద్రతపై అమిత్​ షా సమీక్ష

By

Published : Jun 3, 2019, 5:26 PM IST

Updated : Jun 3, 2019, 6:00 PM IST

అంతర్గత భద్రతపై అమిత్​ షా సమీక్ష

అంతర్గత భద్రతా వ్యవహారాలపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, హోంశాఖ కార్యదర్శి రాజీవ్​ గౌబా, నిఘా విభాగాధిపతి రాజీవ్​ జైన్​ తదితరలు పాల్గొన్నారు.

జమ్ముకశ్మీర్​లో తాజా పరిస్థితులు సహా సరిహద్దు ప్రాంతాల్లోని వాతావరణంపై అధికారులు హోంమంత్రికి సమాచారం అందించారు.

హోంశాఖలో తరచుగా సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉంటాయి. నిఘా సంస్థ సహా అనేక విభాగాల నుంచి సమాచారం పొందుతారు హోంమంత్రి.

హోంశాఖ మంత్రిగా అమిత్​ షా గత శనివారమే బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చూడండి:'సైనికుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు'

Last Updated : Jun 3, 2019, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details