తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గాంధీ స్ఫూర్తిని జన హృదయాల్లో నింపండి' - celebrations

మహాత్ముడి 150వ జయంతి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని భాజపా ఎంపీలు, రాష్ట్ర బాధ్యులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్​షా. ఫిట్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

'గాంధీ స్ఫూర్తిని జన హృదయాల్లో నింపండి'

By

Published : Sep 22, 2019, 6:43 AM IST

Updated : Oct 1, 2019, 1:02 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం గాంధీ 150వ జయంతి. మరికొద్ది రోజుల్లోనే బాపూజీ జయంతి అయిన అక్టోబర్​ 2 రానున్న నేపథ్యంలో గాంధీ జయంతి ప్రత్యేక కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లాలని భాజపా ఎంపీలు, రాష్ట్రాల నేతలకు దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్​షా. మహాత్ముడి విలువలు, కేంద్ర పథకాలు అయిన మేక్​ ఇన్ ఇండియా, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లపై అవగాహన కోసం కృషి చేయాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా రాష్ట్రాల్లోని పార్టీల నేతలతో సంభాషించారు అమిత్​షా. అక్టోబర్ 2న జరిగే జయంతి వేడుక సందర్భంగా ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా మహాత్ముడి సిద్ధాంతాలకు విశేష ప్రాధాన్యం కల్పించాలని కోరారు.

ఆగస్టు15న మోదీ ప్రకటించిన ఫిట్ ఇండియా కార్యక్రమంపైనా నేతలకు దిశానిర్దేశం చేశారు షా. స్వదేశీ వస్తువుల వినియోగం, అహింస, శుభ్రత, ఖాదీ ధరించడం వంటి గాంధీ సిద్ధాంతాలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కోరారు.

' గాంధీ 150 వ జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలి. మరచిపోని విధంగా అమలు చేయాలి'

-అమిత్​షా

గాంధీ సంకల్ప్​ యాత్ర..

అక్టోబర్​ 2 నుంచి 31 వరకు గాంధీ సంకల్ప్ యాత్ర పేరుతో కార్యక్రమం నిర్వహించనుంది భాజపా. సమాజంలోని వివిధ వర్గాలకు చేరే విధంగా ఈ ప్రచారానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో 3229 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 15 రోజుల పాటు ప్రజాప్రతినిధులు పాదయాత్ర నిర్వహించాలని సూచించారు.

సెప్టెంబర్​ 26న భాజపా సిద్ధాంతకర్త దీన్​దయాళ్​ ఉపాధ్యాయ జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు షా.

ఇదీ చూడండి: 'సహజీవనంకన్నా పెళ్లితోనే ఎక్కువ ఆనందం!'

Last Updated : Oct 1, 2019, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details