తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీజేఐ కేసులో 'కుట్ర కోణం'పై రేపు విచారణ - సుప్రీం కోర్టు

భారత ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన లైంగిక ఆరోపణల వెనుక కుట్ర ఉందన్న న్యాయవాదికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్​లో పేర్కొన్న అంశాలపై స్పష్టత నివ్వాలని ఆదేశించింది. బుధవారం విచారణ చేపట్టనుంది.

సీజేఐ కేసులో 'కుట్ర కోణం'పై రేపు విచారణ

By

Published : Apr 23, 2019, 12:00 PM IST

Updated : Apr 23, 2019, 1:14 PM IST

సీజేఐ కేసులో 'కుట్ర కోణం'పై రేపు విచారణ

లైంగిక వేధింపుల పేరిట తప్పుడు కేసులో ప్రధాన న్యాయమూర్తిని ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్న న్యాయవాదికి సుప్రీంకోర్టు తాఖీదులు జారీచేసింది. సోమవారం సమర్పించిన ప్రమాణపత్రంలోని అంశాలపై మరింత స్పష్టత ఇవ్వాలని న్యాయవాది ఉత్సవ్​ సింగ్​ బైన్స్​ను ఆదేశించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతతో ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన కేసుగా ఈ అంశంపై బుధవారం ఉదయం పదిన్నరకు విచారణ చేపడతామని జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది.

అఫిడవిట్​లో ఏముందంటే...

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయిపై వచ్చిన ఆరోపణలు కుట్రపూరితమని న్యాయవాది ఉత్సవ్​ సింగ్​ సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్​ సమర్పించారు. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగి పట్ల వాదించడం సహా దిల్లీలోని ప్రెస్​ క్లబ్​లో సీజేఐకు వ్యతిరేకంగా పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేస్తే కోటిన్నర రూపాయలు ఇస్తానని కొందరు తనను సంప్రదించినట్లు ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.

ఉత్సవ్​ సింగ్​ అఫిడవిట్​పై బుధవారం విచారణ జరగనుంది.

ఇదీ చూడండీ: 'తీవ్రవాదులకు ఐఈడీ- మనకు ఓటర్ ఐడీ'

Last Updated : Apr 23, 2019, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details