తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్​నాటకం: విదేశాల్లో అగ్రనేతలు... రాష్ట్రంలో చిక్కులు

కర్ణాటకలో 12 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రభుత్వ పతనం ఖాయంగా కనిపిస్తోంది. కూటమి పార్టీలైన జేడీఎస్​, కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షులు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి.

కర్​నాటకం: విదేశాల్లో అగ్రనేతలు... రాష్ట్రంలో చిక్కులు

By

Published : Jul 6, 2019, 5:08 PM IST

కర్ణాటక అధికార కూటమిలోని జేడీఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కుమార స్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావు బ్రిటన్​కు వెళ్లారు. ఆదివారం బెంగళూరు రానున్నారు.

కూటమి ప్రధాన పార్టీల అధినేతలు రాష్ట్రంలో లేని సమయంలో ఎమ్మెల్యేల రాజీనామా పెను దుమారం రేపింది.

ఈ నెల 1న ఎమ్మెల్యేల రాజీనామా పర్వం మొదలైన వెంటనే ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. రాష్ట్ర పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ట్వీట్​ చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలని భాజపా కలలుకంటోందని ఆరోపించారు.

నేడు 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాపై కాంగ్రెస్​ అధినాయకత్వం బెంగళూరులో ఉన్న ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సర్దిచెప్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్​ సీనియర్ నేతలు.

ఇదీ చూడండి: కుమారస్వామి సర్కార్​ పతనం ఖాయం!

ABOUT THE AUTHOR

...view details