ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో 35 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగిన ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. వారిలో మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అందులో ఇద్దరికి అత్యాచారంతో సంబంధం ఉండగా.. మరో ముగ్గురు సహకరించినట్లు వెల్లడించారు.
కార్వీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ నిందితుడి ఇంట్లో సెప్టెంబర్ 28న ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.