తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డిసెంబర్​ 1న ముఖ్యమంత్రిగా ఠాక్రే ప్రమాణ స్వీకారం - maharastra politics

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సిద్ధమవుతున్నాయి. వీరి కూటమికి మహా వికాస్ అఘాడీగా నామకరణం చేసి.. నాయకుడిగా సేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేను ఎన్నుకున్నారు. డిసెంబర్​ 1న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఠాక్రే ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజును కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు.

MH-UDDHAV-CM
MH-UDDHAV-CM

By

Published : Nov 26, 2019, 8:37 PM IST

Updated : Nov 26, 2019, 8:45 PM IST

ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామాతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన సమాయత్తమవుతున్నాయి. మూడు పార్టీల కూటమికి మహా వికాస్‌ అఘాఢీగా నామకరణం చేశారు.

ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటు, విధి విధానాలపై ముంబయిలోని ట్రైడెంట్‌ హోటల్‌లో కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ కూటమి నాయకుడిగా శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేను 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ముఖ్యమంత్రిగా..

ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఠాక్రేకే మొగ్గు చూపారు. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే డిసెంబర్‌ 1న ప్రమాణం చేయనున్నారని మరాఠా యోధుడు శరద్​ పవార్ ప్రకటించారు. ముంబయిలోని శివాజీ పార్క్‌ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఠాక్రే కుటుంబం నుంచి సీఎం కుర్చీలో కూర్చొనే ఘనత ఉద్ధవ్​దే కానుంది.

కలలో కూడా ఊహించలేదు..

ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటంపై ఉద్ధవ్​ ఠాక్రే సంతోషం వ్యక్తం చేశారు. ఫడణవీస్ చేసిన ప్రతి ఆరోపణకూ సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

"రాష్ట్రాన్ని పాలిస్తానని కలలో కూడా ఊహించలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు. మీరందరూ నాపై పెట్టిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తా. ఛత్రపతి శివాజీ కోరుకున్న మహారాష్ట్రను పునర్నిర్మిద్దాం. ఫడణవీస్​ లేవనెత్తిన ప్రశ్నలంటికీ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నేను దేనికీ భయపడట్లేదు."

-ఉద్ధవ్​ ఠాక్రే, శివసేన అధినేత

ఈ సమావేశం నేపథ్యంలో మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ట్రైడెంట్‌ హోటల్‌ వద్దకు చేరుకున్నారు. శరద్​ పవార్​ను కీర్తిస్తూ నినాదాలు చేశారు.ఇదీ చూడండి: పార్లమెంట్ సంయుక్త సమావేశం బహిష్కరించిన విపక్షాలు

Last Updated : Nov 26, 2019, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details