గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో పోలీసులు పటిష్ఠ భద్రత చేపట్టారు. ఉగ్రవాదులు ఎలాంటి దాడులకు పాల్పడకుండా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. దాదాపు వెయ్యిమంది భద్రతా సిబ్బంది దిల్లీపై అన్ని వైపులనుంచి నిఘా ఉంచారు.
మార్కెట్లు, షాపింగ్‌మాల్స్‌పై ప్రత్యేక నిఘా ఉంచారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ప్రతిరోజూ గస్తీ నిర్వహిస్తున్నామని నైరుతి దిల్లీ డిప్యూటీ కమిషనర్ అమిత్ కౌశిక్ తెలిపారు. మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌కు వచ్చే, పోయే మార్గాలలో గట్టి నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు.