కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు భద్రత తొలగించలేదని.. ఎస్పీజీ నుంచి అంబులెన్స్‌తో కూడిన జడ్ ప్లస్‌కు మార్పు చేశామని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ) చట్టం-1988 సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా వివరణ ఇచ్చారు షా. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రతీకార విధానంలో భాజపా ఎన్నడూ నిర్ణయాలు చేపట్టదని.. ఇలాంటివి కాంగ్రెస్ మాత్రమే చేస్తుందని ఆరోపించారు. హస్తం పార్టీ గతంలో చాలాసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని ఎదురుదాడి చేశారు.
" గాంధీ కుటుంబానికి భద్రత ఉపసంహరించేందేకే ఎస్పీజీ చట్ట సవరణ తీసుకొచ్చారనేలా ప్రచారం కల్పించారు. గాంధీ కుటుంబానికి రక్షణ ఉపసంహరించలేదు.. దానిని ఆధునిక భద్రతా అనుసంధానంతో, అంబులెన్స్ కలిగిన జడ్ ప్లస్‌గా మార్చాం. ఇది దేశవ్యాప్తంగా రక్షణ ఇస్తుంది. "