తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ కొత్త రికార్డ్​ - వర్షాకాల సెషన్​

రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ సెషన్​... చరిత్రలోనే రెండో అత్యల్ప సమయం సాగిన వర్షాకాల సమావేశాలుగా నిలిచింది.

Rajya Sabha
వర్షాకాల సమావేశాలు

By

Published : Sep 23, 2020, 2:16 PM IST

వివాదాస్పద బిల్లులు... విపక్షాల నిరసనలు... అవిశ్వాస తీర్మానం-సస్పెన్షన్-బాయ్​కాట్​... వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ సాగిన తీరు ఇది. ​రాజకీయంగా పెను దుమారానికి వేదికైన ఈ సమావేశాలు... చరిత్రలోనే రెండో అత్యల్ప సమయం సాగిన వర్షాకాల సెషన్​​గా రికార్డు సృష్టించింది.

  • ఇప్పటివరకు జరిగిన మొత్తం 252 పార్లమెంటు సమావేశాల్లో ఇది 3వ అత్యల్ప సమయం సాగిన సెషన్​.
  • ఇప్పటివరకు 89వ సెషన్​ 40 సిట్టింగ్​లతో అతిపెద్ద వర్షాకాల సమావేశాలుగా నిలిచింది.
  • ప్రస్తుత 252వ సెషన్​ బుధవారం నిరవధిక వాయిదా పడింది. ఈ వర్షాకాల సమావేశాల్లో కేవలం 10 సిట్టింగులు మాత్రమే జరిగాయి. 1952 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం 69 వర్షాకాల సమావేశాల్లో అతి తక్కువ సిట్టింగ్​ల పరంగా రెండవ స్థానంలో నిలిచింది.
  • 1979 జులైలో నిర్వహించిన 110వ వర్షాకాల సమావేశాలు, 1999 అక్టోబర్​లో నిర్వహించిన 187వ సమావేశాలు కేవలం 6 సిట్టింగ్​లతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.
  • అత్యధిక కాలం జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలుగా రికార్డు సృష్టించిన 89వ సెషన్​.. 1974లో నిర్వహించారు. మొత్తం 40 సిట్టింగ్​లతో అతిపెద్ద వర్షాకాల సెషన్​గా నిలిచింది.​
రాజ్యసభ
  • ఇప్పటివరకు జరిగిన 69 వర్షాకాల సమావేశాల్లో.. ప్రస్తుత సెషన్​తో కలిపి 3 సెషన్లు 10 కంటే తక్కువ సిట్టింగ్​లతో జరిగాయి. 16 సెషన్లు 11 నుంచి 20 సిట్టింగ్​ల మధ్య జరగగా.. 40 సెషన్లు ఒక్కోటి 21 నుంచి 30 మధ్య నిర్వహించారు. ఇక 9 సమావేశాలు 31 నుంచి 39 సిట్టింగ్​లతో చేపట్టారు. ఒకే సెషన్​ 40 సిట్టింగ్​లతో జరిగింది.
  • ప్రస్తుత వర్షాకాల సమావేశాలు​ ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్​ 14 నుంచి అక్టోబర్​ 1 మధ్య 18 సిట్టింగ్​లతో జరగాలి. కానీ సెప్టెంబర్​ 23నే నిరవధిక వాయిదా పడింది. 1976లో జరిగిన 76వ వర్షాకాల సమావేశాలు 18 సెషన్లతోనే నిర్వహించారు. మరో 6 సెషన్లూ 16 నుంచి 17 సిట్టింగ్​లతోనే ముగిశాయి.
  • మొత్తం 69 వర్షాకాల సమావేశాల్లో 34 సెషన్లు జులై-ఆగస్టు మధ్యే నిర్వహించారు. ఆగస్టు-సెప్టెంబర్ మధ్య 16, జులై-సెప్టెంబర్ మధ్య 6 నడిచాయి. ఆగస్టు-అక్టోబర్​ మధ్య మరో 5 సెషన్లు నిర్వహించారు. 187వ పార్లమెంట్​ సమవేశాలనే కేవలం 6 సిట్టింగ్​లతో పూర్తిగా అక్టోబర్​లోని నిర్వహించారు. నాడు అటల్​ బిహారీ వాజ్​పేయీ మూడవ సారి ప్రధాని అయ్యాక ఈ సమవేశాలు జరిగాయి.​
  • మొత్తంగా రాజ్యసభలో నిర్వహించిన మొత్తం 252 సెషన్లలో.. 1979 ఆగస్టు 20న నిర్వహించిన 111వ సెషన్​ ఒకే సిట్టింగ్​తో అతి తక్కువ సమయం నిర్వహించిన సెషన్​గా చరిత్ర పుటలకెక్కింది. ఈ సమావేశాలప్పుడే నాటి ప్రధాని చరణ్​ సింగ్​ రాజీనామా చేశారు.

ABOUT THE AUTHOR

...view details