రెండో విడత మలబార్-2020 నావిక దళ విన్యాసాలు.. ఉత్తర అరేబియా సముద్రంలో ప్రారంభమయ్యాయి. భారత్‌తోపాటు అమెరికా నావికాదళం, జపాన్ సాగర స్వీయ రక్షణ భద్రతా దళం, ఆస్ట్రేలియా నౌక దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. భారత అమ్ముల పొదిలోని ప్రధాన అస్త్రం ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎన్ఎస్ నిమిట్జ్‌తో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌కు చెందిన యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
మలబార్-2020 రెండో విడత విన్యాసాలు షురూ - ఐఎన్ఎస్ విక్రమాదిత్య
రెండోదశ మలబార్-2020 నావికా దళ విన్యాసాలు ఉత్తర అరేబియా సముద్రంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలకు చెందిన యుద్ధనౌకలు ఇందులో భాగస్వాములయ్యాయి.
మలబార్-20 రెండో విడత విన్యాసాలు షురూ
అణుశక్తితో పనిచేసే.. ప్రపంచంలోనే అతి పెద్ద యుద్ధనౌక యూఎన్ఎస్ నిమిట్జ్ ఈ విన్యాసాల్లో పాల్గొనడం ప్రత్యేకంగా నిలుస్తుందని ఓ అధికారి తెలిపారు. చతుర్భుజ కూటమిలో భాగమైన ఈ నాలుగు దేశాలు సంయుక్తంగా నిర్వహించే ఈ విన్యాసాల వల్ల పరస్పర సమన్వయం పెరుగుతందని భారత నావికాదళం ప్రకటించింది. మలబార్ మొదటి విడత విన్యాసాలు ఈ నెల 3 నుంచి 6 వరకు బంగాళాఖాతంలో జరగగా.. రెండో విడతగా జరుగుతున్న ఈ విన్యాసాలు 20వ తేదీ వరకూ కొనసాగనున్నాయి.
ఇవీ చూడండి: