తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర

ఏప్రిల్​ 18న సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్​ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారానికి తెరపడింది. 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 97 లోక్​సభ నియోజకవర్గాల్లో ఓటింగ్​ కోసం ఈసీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర

By

Published : Apr 16, 2019, 6:22 PM IST

సార్వత్రిక ఎన్నికల రెండో విడత కోసం వాడీవేడిగా జరిగిన ప్రచారం ముగిసింది. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్​ 18న రెండో విడత పోలింగ్​ జరగనుంది.

97 నియోజకవర్గాల్లోని మొత్తం 15.79కోట్ల మంది ఓటర్లు 1629 మంది భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం లక్షా 81 వేల పోలింగ్​ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది.

భారీ భద్రత...

రెండో దశ పోలింగ్​ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. మొదటి దశలో ఏర్పడిన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది.

తమిళనాడులో...

దక్షిణ భారతంలో అత్యధిక సీట్లున్న రాష్ట్రం తమిళనాడు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండే ఈ రాష్ట్రంలోనున్న మొత్తం 39 లోక్​సభ నియోజకవర్గాలకు ఈ దశలోనే ఎన్నిక పూర్తి కానుంది. ఇక్కడ ప్రధానపోరు డీఎంకే,అన్నా డీఎంకేల మధ్యనే.

లోక్​సభతో పాటు తమిళనాడులోని 18 శాసనసభ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది.

ఈశాన్యాన...

ఈశాన్యాన ఈ విడతలో మూడు రాష్ట్రాల్లో పోలింగ్​ జరుగుతుంది. అసోంలో 5 స్థానాలు, మణిపూర్​లో ఒక స్థానం, త్రిపురలో ఒక స్థానానికి ఏప్రిల్​ 18న ఓటింగ్.

రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం 2వ విడత నియోజకవర్గాలు/ మొత్తం నియోజకవర్గాలు ఓటర్ల సంఖ్య పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలింగ్​ బూత్​ల సంఖ్య
అసోం 05 / 14 6910592 50 8992
బిహార్ 05 /40 8552274 68 8644
ఛత్తీస్​గఢ్ 03/11 4895719 36 6484
జమ్ముకశ్మీర్ 02/06 2960027 24 4426
కర్ణాటక 14/28 26338277 241 30410
మహారాష్ట్ర 10/48 18546036 179 20321
మణిపూర్ 01/02 928626 11 1300
ఒడిశా 05/21 7693123 35 9117
తమిళనాడు 39/39 59869758 845 67664
త్రిపుర 01/02 1257944 10 1645
ఉత్తరప్రదేశ్ 08/80 14076635 70 16162
పశ్చిమబంగా 03/42 973161 42 5390
పుదుచ్చేరి 01/01 973161 18 970
మొత్తం 97 157934518 1629 181525

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details